హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: లక్ష్మాపూర్ వద్ద ఎలుగుబంటి హల్‌చల్

MDK: రామాయంపేట మండలం లక్ష్మాపూర్ శివారులోని సిద్దిపేట–మెదక్ ప్రధాన రహదారి సమీప వాగు వద్ద ఎలుగుబంటి ప్రత్యక్షమవడంతో స్థానికులు, ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం తెలుసుకున్న పలువురు అక్కడికి చేరుకుని సెల్‌ఫోన్లలో చిత్రీకరించారు. నీటి కోసం అటవీ ప్రాంతం నుంచి వచ్చినట్లు అధికారులు భావిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ సూచించింది.