హైదరాబాద్: 28°C
వార్తలు

రేపు ఉచిత వైద్య శిబిరం

MBNR: ఎస్వీఎస్ మెడికల్ కాలేజ్ ఆస్పత్రి ఆధ్వర్యంలో మాజీ మంత్రి డా. సీ. లక్ష్మారెడ్డి సహకారంతో రేపు నసురుల్లాబాద్‌లోని శ్రీ ఆంజనేయస్వామి ఆలయ కళ్యాణ మండపంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించనున్నారు. చిన్నపిల్లలు, మహిళలు, కంటి, శస్త్రచికిత్స, జనరల్ మెడిసిన్ నిపుణులు వైద్య సేవలు అందించడంతో పాటు అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేయనున్నారు.