హైదరాబాద్: 28°C
వార్తలు

నిర్మలా సీతారామన్‌కు స్వాగతం పలికిన మంత్రి

ATP: నరసరావుపేటలో నిర్వహించనున్న కేంద్ర ప్రభుత్వ పథకాల రుణమేళా కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నులు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఆమెకు పుష్పగుచ్ఛం అందించి ఆత్మీయంగా స్వాగతించారు.