హైదరాబాద్: 28°C
వార్తలు

అయ్యప్పస్వామి ఆలయంలో గుప్త నవరాత్రులు

E.G: ఆషాఢ మాసం సందర్భంగా రాజమహేంద్రవరం గౌతమఘాట్లోని అయ్యప్పస్వామి ఆలయంలో వారాహి మాత గుప్త నవరాత్రులు నిర్వహిస్తున్నట్లు ధర్మశాస్తా ఆధ్యాత్మిక కేంద్రం అధ్యక్షురాలు జక్కంపూడి విజయలక్ష్మి తెలిపారు. ఆలయంలో వారాహి మాతకు తాత్కాలికంగా పీఠం ఏర్పాటు చేసి 23వ తేదీ వరకు ఉత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. 24న అమ్మవారి ఉత్సవాల ఉద్వాసన పూజ నిర్వహించి భక్తులకు పసుపు కుంకుమ, గాజులు, ప్రసాద వితరణ చేస్తామన్నారు.