AKP: కోటవురట్ల మండలంలోని 25 పంచాయతీల్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్వే 91.59 శాతం పూర్తయినట్లు తహశీల్దార్ తిరుమల బాబు గురువారం తెలిపారు. బీఎల్ఎలు ఇంటింటికీ వెళ్లి పారదర్శకంగా సర్వే నిర్వహిస్తున్నారన్నారు. చనిపోయిన వారి పేర్లను ఓటరు జాబితా తాలూకు తొలగించామని చెప్పారు. ఈ మేరకు డిజిటలైజేషన్ కార్యక్రమం కూడా పూర్తయిందని ఆయన పేర్కొన్నారు.
వార్తలు
'కోటవురట్లలో ముమ్మరంగా ఓటర్ల సర్వే'


