AP: షెడ్యూల్డ్ ప్రాంతాల్లో గిరిజనుల హక్కులు, జీవనోపాధికి పూర్తి సహకారం అందించనున్నట్లు మంత్రి సంధ్యారాణి వెల్లడించారు. గిరిజన భూములకు రక్షణ చట్టం అమలు చేస్తూ ఉల్లంఘనలపై చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. షెడ్యూల్డ్ ప్రాంతాల్లో స్థానిక గిరిజనులకు ఉపాధి అవకాశాల కోసం కృషి చేస్తామన్నారు. షెడ్యూల్ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం దృఢ సంకల్పంతో పనిచేస్తోందని మంత్రి తెలిపారు.
వార్తలు
ప్రభుత్వం దృఢ సంకల్పంతో పనిచేస్తోంది: మంత్రి


