హైదరాబాద్: 28°C
వార్తలు

అల్లూరి జిల్లా కలెక్టర్‌ను కలిసిన ఏడీఎంహెచ్‌ఓ

ASR: అదనపు జిల్లా వైద్య ఆరోగ్య అధికారిగా బాలమురళీకృష్ణ గురువారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన జిల్లా కలెక్టర్ టి. నిషాంతిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. గిరిజన ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే అవకాశం రావడం సంతోషంగా ఉందని, అందరి సమన్వయంతో జిల్లాలో ఆరోగ్య రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు.