HYD: నాచారం పెద్ద చెరువు పునరుద్ధరణ పనులకు హైడ్రా శ్రీకారం చుట్టింది. రూ.28 కోట్లతో చేపడుతున్న ఈ అభివృద్ధి పనులను కమిషనర్ ఏవీ రంగనాథ్ ప్రారంభించారు. ఇందులో భాగంగా చెరువు కట్ట అభివృద్ధి, పాత్వే, పార్కులు, ఓపెన్ జిమ్లు, ప్లే ఏరియాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ పనులను 9 నెలల్లో పూర్తి చేస్తామని, అలాగే యాప్రాల్లోని నాగిరెడ్డి కుంటను కూడా త్వరలోనే అభివృద్ధి చేస్తామని హైడ్రా తెలిపింది.
వార్తలు
నాచారం పెద్ద చెరువు పునరుద్ధరణకు హైడ్రా శ్రీకారం


