హైదరాబాద్: 28°C
వార్తలు

ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్ నుంచి జారిపడి యువకుడి మృతి

MHBD: ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు నుంచి ప్రమాదవశాత్తు జారిపడి ఓ యువకుడు మృతి చెందిన ఘటన కేసముద్రం-ఇంటికన్నె రైల్వే స్టేషన్ల మధ్య గురువారం చోటుచేసుకుంది. మృతుడు ఖమ్మం జిల్లా ప్రకాశనగర్ మండలానికి చెందిన మణికంఠ (25)గా గుర్తించారు. ఖమ్మం నుంచి సికింద్రాబాద్‌కు సహచరులతో కలిసి ప్రయాణిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు వరంగల్ రైల్వే పోలీసులు తెలిపారు.