MHBD: గార్ల రైల్వే స్టేషన్‌లో గురువారం జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ప్లాట్‌ఫామ్ నంబర్-2 నుంచి నంబర్-1కు పట్టాలు దాటుతుండగా సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బాధితుడి రెండు కాళ్లు తెగిపోయాయి. సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని ప్రథమ చికిత్స అనంతరం బాధితుడిని ఆస్పత్రికి తరలించారు.
వార్తలు
రైల్వే స్టేషన్‌లో విషాదం.. రైలు ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు


