హైదరాబాద్: 28°C
వార్తలు

సాయి హత్యపై సమగ్ర దర్యాప్తున జరపాలి: జగ్గిరెడ్డి

కోనసీమ: రావులపాలెం యువకుడు ఆనెం సాయి మృతి కేసుపై ఉన్నతాధికారుల పర్యవేక్షణలో సమగ్ర దర్యాప్తు చేపట్టాలని YSRCP జిల్లా అధ్యక్షుడు, మాజీ MLA చిర్ల జగ్గిరెడ్డి డిమాండ్ చేశారు. ఈ ఘటనలో భాగస్వాములైన వారందరిపై కఠిన చర్యలు తీసుకుని బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని గురువారం డిమాండ్ చేశారు. ఈ కేసు విచారణ నిష్పాక్షికంగా సాగాలని కోరారు.