హైదరాబాద్: 28°C
వార్తలు

ఆసియాలో అతిపెద్ద జూ పార్క్‌ ఏపీలోనే: అయ్యన్న పాత్రుడు

AP: రాష్ట్రంలో విశాఖపట్నం, తిరుపతిలలో జూ పార్క్‌లు ఉన్నాయని అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు చెప్పారు. తిరుపతి ఎస్వీ జూ పార్క్ 3100 ఎకరాలలో ఏర్పాటు చేయబడి విస్తరణ పరంగా ఆసియాలో అతిపెద్ద జూ పార్క్‌గా పేరుగాంచినదన్నారు. ఎస్వీ జూ పార్క్ అభివృద్ధికి దాదాపు రూ.6 కోట్లు అవసరం అవుతుందన్న అంచనా ఉందని, ఇందులో రూ.3 కోట్లు టీటీడీ నుంచి సమీకరించనున్నట్లు వెల్లడించారు.