హైదరాబాద్: 28°C
వార్తలు

ఆలయ అభివృద్ధికి రూ.13 కోట్లు మంజూరు

SRPT: హుజూర్ నగర్ నియోజకవర్గంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం రూ.13 కోట్లు మంజూరు చేసింది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి మేరకు గురువారం రాత్రి జీవో జారీ అయింది. ఈ నిధులతో తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో కృష్ణా నదిలో బోటింగ్ పాయింట్, పర్యాటక సౌకర్యాల కల్పన పనులు చేపట్టనున్నారు.