హైదరాబాద్: 28°C
వార్తలు

రేపు జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ పోటీలు

నెల్లూరు నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో జిల్లాస్థాయి బ్యాడ్మింటన్ పోటీలను శనివారం నిర్వహిస్తున్నట్లు బ్యాడ్మింటన్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ముక్కాల ద్వారకానాథ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అండర్ 13,17,19 మెన్స్, ఉమెన్స్ విభాగాల్లో పోటీలు నిర్వహిస్తామన్నారు. ఇక్కడ గెలిచిన వారిని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేస్తామన్నారు.