హైదరాబాద్: 28°C
వార్తలు

శిథిలావస్థలో ఉన్న విద్యుత్ స్థంభాన్ని పరిశీలించిన గిరిధర్ రెడ్డి

నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని సర్వోదయ కాలేజీ వద్ద శిథిలావస్థలో ఉన్న విద్యుత్ స్థంభాన్ని విద్యుత్ అధికారులతో కలిసి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పరిశీలించారు. ప్రజలకు ఎటువంటి సమస్య లేకుండా చేసేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా విద్యుత్ శాఖ అధికారులకు సూచించారు. త్వరగా ఈ సమస్యను పరిష్కరిస్తామన్నారు.