హైదరాబాద్: 28°C
వార్తలు

హైకోర్టు ప్రభుత్వ ప్లీడర్లుగా ముగ్గురి నియామకం

AP: రాష్ట్ర హైకోర్టులో ప్రభుత్వ ప్లీడర్లుగా ముగ్గురిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ప్లీడర్లుగా ఎస్‌వీ.రమణ, కె.పల్లవి, టీవీపీ సాయి విహారిని నియమించింది. హైకోర్టులో ప్రభుత్వానికి సంబంధించిన వివిధ వ్యాజ్యాలు, రాజ్యాంగపరమైన అంశాలు, ఇతర కేసుల్లో ప్రభుత్వం తరఫున వీరు వాదనలు వినిపించనున్నారు. ఈ మేరకు వీరు త్వరలోనే బాధ్యతలు స్వీకరించనున్నారు.