హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు శ్రీవారి ఆలయంలో ఆణివార ఆస్థానం

AP: తిరుమల శ్రీవారి ఆలయంలో ఇవాళ శాస్త్రోక్తంగా ఆణివార ఆస్థానం జరగనుంది. ఉదయం ఘంటా మండపం వద్ద ప్రత్యేక పూజలు చేయనున్నారు. గరుత్మంతుడికి అభిముఖంగా ఉభయదేవేరులతో కలిసి మలయప్పస్వామి, మరో పల్లకిపై స్వామివారి సర్వసైన్యాధ్యక్షుడైన విష్వక్సేనులు దక్షిణాభిముఖంగా వేంచేస్తారు. సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి పుష్పపల్లకి వాహనంపై భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.