హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు రెండో 'వందే భారత్ స్లీపర్' రైలు ప్రారంభం

దేశంలోనే రెండో వందే భారత్ స్లీపర్ రైలును ప్రధాని మోదీ ఇవాళ ప్రారంభించనున్నారు. ఈ రైలు ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి నుంచి పంజాబ్‌లోని ఛెహర్తా (అమృత్‌సర్ సమీపంలో) వరకు ప్రయాణికులకు సేవలు అందించనుంది. అత్యాధునిక వసతులతో కూడిన ఈ రైలు ప్రయాణికులకు రాత్రివేళ ప్రయాణం మరింత సులభతరం కానుంది. అలాగే హైడ్రోజన్ రైలు కూడా మోదీ ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు.