హైదరాబాద్: 28°C
వార్తలు

ఈనెల 21న జిల్లాలో జాబ్ మేళా

KNR: జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈ నెల 21న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జాబ్ మేళా నిర్వహించనున్నారు. హెచ్‌ఎమ్ ఛారిటబుల్ ఫౌండేషన్‌లో 25 ఖాళీల భర్తీ కోసం ఈ మేళా ఏర్పాటు చేశారు. 10వ తరగతి, డిగ్రీ, హోటల్ మేనేజ్‌మెంట్ అర్హత కలిగిన 20 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సు గల అభ్యర్థులు ఒరిజినల్ విద్యార్హత సర్టిఫికెట్లు, జిరాక్స్ కాఫీలతో హాజరుకావాలి అన్నారు.