హైదరాబాద్: 28°C
వార్తలు

9వ తరగతిలో మూడో భాష వద్దు: సుప్రీంకోర్టు

CBSE తొమ్మిదో తరగతిలో కొత్త భాషను ప్రవేశపెట్టడం సరికాదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. దీనివల్ల విద్యార్థులపై ఒత్తిడి పెరుగుతుందని పేర్కొంది. తొమ్మిదో తరగతికి బదులు.. ఏదైనా కొత్త భాషను ఐదు లేదా ఆరో తరగతిలోనే ప్రవేశపెట్టాలని ప్రభుత్వానికి సూచించింది. తమిళనాడులో జవహర్ నవోదయ విద్యాలయాల ఏర్పాటుకు సంబంధించిన పిటిషన్ విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది.