హైదరాబాద్: 28°C
వార్తలు

అంతకంటే నీచమైన నేరం ఉంటుందా?: హైకోర్టు

మైనర్‌ బాలికపై లైంగిక దాడి కేసులో ఆమె తండ్రికి పడిన జీవిత ఖైదును సమర్థిస్తూ బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కన్న కూతురిని కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే.. మృగంలా మారి ఆమెపై అత్యాచారానికి పాల్పడితే అంతకంటే హేయమైన నేరం మరొకటి ఉండదని పేర్కొంది. ఈ మేరకు తన శిక్షను సవాల్ చేస్తూ నిందితుడు దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టి వేస్తూ తీర్పునిచ్చింది.