AP: జూన్ 26 నుంచి జూలై 16 వరకు రాష్ట్రవ్యాప్తంగా 12 కొవిడ్ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. కాకినాడ జిల్లా వాసికి తమిళనాడు వేలూరు సీఎంసీలో కొవిడ్ నిర్ధరణ అయిందని తెలిపింది. కడప జిల్లాలో 8, గుంటూరులో 2, కాకినాడ, విశాఖ జిల్లాల్లో ఒక్క కేసు నమోదైనట్లు చెప్పింది. ఈ కేసులన్నీ వేర్వేరు ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయని.. ఒకే చోట గుంపుగా బయటపడలేదని పేర్కొంది.
వార్తలు
రాష్ట్రంలో 12 కరోనా కేసులు నమోదు: వైద్యారోగ్య శాఖ


