ATP: తాడిపత్రి రూరల్ పోలీస్ స్టేషన్ నూతన సీఐగా డీవీ నారాయణరెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ..శాంతిభద్రతల పరిరక్షణకు మొదటి ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి శ్రమిస్తానని వెల్లడించారు. రౌడీయిజం, అక్రమ ఇసుక రవాణా, అసాంఘిక శక్తులపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.
వార్తలు
రూరల్ సీఐగా నారాయణరెడ్డి బాధ్యతలు


