హైదరాబాద్: 28°C
వార్తలు

మైనర్‌ బాలికపై అత్యాచారం.. కేసు నమోదు

TG: HYD సనత్‌నగర్ PS పరిధిలో దారుణం చోటు చేసుకుంది. మైనర్ బాలికపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. నిన్న ఉదయం బాలిక పాఠశాలకు వెళ్తుండగా..  షాబాజ్ అనే వ్యక్తి ఆమెను వెంబడించి బైక్ ఎక్కించుకున్నాడు. అనంతరం సనత్‌నగర్‌లోని ఓ పార్క్‌లోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు సనత్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు.