హైదరాబాద్: 28°C
వార్తలు

తిమ్మరాజు చెరువుకు ఏలేరు జలాలు

KKD: ఏలేరు జలాశయం నుంచి తిమ్మరాజు చెరువుకు సాగునీటిని కూటమి నాయకులు గంగమ్మకు పూజలు నిర్వహించి విడుదల చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ గొల్లపల్లి నరసింహమూర్తి, టీడీపీ మండల అధ్యక్షుడు జ్యోతుల పెదబాబు తదితరులు పాల్గొన్నారు. రైతులకు సకాలంలో సాగునీరు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, నీటి వినియోగాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని నాయకులు సూచించారు.