హైదరాబాద్: 28°C
వార్తలు

గోల్కొండ బోనాల్లో ఈటల ప్రత్యేక పూజలు

HYD: ఆషాఢ మాస బోనాల ప్రారంభోత్సవం సందర్భంగా గోల్కొండ కోటలోని శ్రీ జగదాంబ మహంకాళి అమ్మవారిని ఎంపీ ఈటల రాజేందర్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. బోనాలు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని పేర్కొన్నారు. ఈ సంప్రదాయాన్ని భావితరాలకు అందించడం అందరి బాధ్యత అని చెబుతూ ప్రజలకు బోనాల శుభాకాంక్షలు తెలిపారు.