హైదరాబాద్: 28°C
వార్తలు

పేదలకు అన్నదానం

విజయనగరంలో శ్యామ్ మోటార్స్ అధినేత శ్యామ్ సుందర్ రావు తన జన్మదినాన్ని పురస్కరించుకుని గురువారం పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజంలో తోటి వారికి సహాయం చేయడం ద్వారా కలిగే ఆనందం వెలకట్టలేనిదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రెయ్యి శంకర్ రెడ్డి, శేఖర్ తదితరులు పాల్గొని, ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలను అభినందించారు.