హైదరాబాద్: 28°C
వార్తలు

SIR ప్రక్రియపై రేపటి కాంగ్రెస్ మీటింగ్ వాయిదా

TG: SIR ప్రక్రియపై రేపు జరగాల్సిన కాంగ్రెస్ జూమ్ మీటింగ్ వాయిదా పడింది. ఈ కీలక సమావేశాన్ని ఆదివారం ఉదయం 11 గంటలకు నిర్వహించనున్నారు. సీఎం రేవంత్, ఏఐసీసీ ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో జరగనున్న ఈ భేటీలో MLAలు, డీసీసీ అధ్యక్షులు పాల్గొననున్నారు. SIR ప్రక్రియకు తొలి ప్రాధాన్యతనిచ్చి, సమన్వయంతో పనిచేయాలని మీనాక్షి డీసీసీలకు సూచించారు.