హైదరాబాద్: 28°C
వార్తలు

ఇస్కాన్ రథయాత్రలో మంత్రి శ్రీధర్ బాబు

HYD: హైదరాబాద్ అబిడ్స్‌లో ఇస్కాన్ నిర్వహించిన స్వర్ణోత్సవ శ్రీ జగన్నాథ రథయాత్ర వేడుకల్లో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పాల్గొన్నారు. వేలాది మంది భక్తులు భక్తిశ్రద్ధలతో, అపార ఉత్సాహంతో రథోత్సవంలో పాల్గొనడం ఆనందాన్ని కలిగించిందని ఆయన తెలిపారు. ఈ వేడుక తెలంగాణ సాంస్కృతిక, ఆధ్యాత్మిక వైభవాన్ని ప్రతిబింబించిందన్నారు.