హైదరాబాద్: 28°C
వార్తలు

మైసమ్మ అమ్మవారికి తొలి బోనం సమర్పణ

HYD: ఆషాఢ మాస బోనాల సందర్భంగా హైదరాబాద్ ట్యాంక్‌బండ్ కనకాలకట్ట మైసమ్మ అమ్మవారి సన్నిధిలో తెలంగాణ రాష్ట్ర కుమ్మరి సంఘం (TRKS) తొలి బోనం మహోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించింది. ఈ వేడుకలో భాగంగా బొడ్డుపల్లి రజిత-ఉపేంద్రం, బొడ్డుపల్లి సునీత-రమేష్‌లు భక్తితో బోనాలు ఎత్తుకున్నారు. భక్తులు భారీగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని, ఆశీస్సులు పొందారు.