HYD: తెలంగాణ సంస్కృతికి ప్రతీక బోనాల పండుగ అని మంత్రి కొండా సురేఖ అన్నారు. కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో లోయర్ ట్యాంక్ బండ్‌లోని శ్రీ జగదీష్ మందిరంలో నిర్వహించిన బోనాల జాతరలో పాల్గొని అమ్మవారికి బోనం సమర్పించారు. ఆమె మాట్లాడుతూ.. మట్టి కుండలోనే బోనం సమర్పించడం అనాదిగా వస్తున్న సంప్రదాయమని, ప్రజలందరూ అదే ఆచారాన్ని కొనసాగించాలని కోరారు. ఈ వేడుకలో మంత్రి పొన్నం కూడా ఉన్నారు.
వార్తలు
VIDEO: లోయర్ ట్యాంక్ బండ్ వద్ద బోనాల జాతర


