హైదరాబాద్: 28°C
వార్తలు

'నిరాహార దీక్ష విజయవంతం చేయాలి'

GDWL: మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం జూలై 20వ తేదీన హైదరాబాద్‌లోని హెచ్‌ఎండీఏ కార్యాలయం ముందు చేపట్టే నిరాహార దీక్షను జయప్రదం చేయాలని సీఐటీయూ గద్వాల్ జిల్లా అధ్యక్షుడు ఉప్పేర్ నరసింహ పిలుపునిచ్చారు. గురువారం వడ్డేపల్లి మండల కేంద్రంలో జరిగిన కార్మికుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విధుల్లో ఉంటూ మరణించిన కుటుంబాలను ప్రభుత్వం పట్టించుకోవాలన్నారు.