NLG: చిట్యాల మండలం పెద్దకాపర్తిలో వర్షాలు కురవాలని గ్రామస్తులు పురాతన ఆచారాలను పాటించారు. మహిళలు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయ పద్ధతిలో కప్పకాముడు ఆటలు ఆడుతూ, పాటలు పాడుతూ భక్తిని చాటుకున్నారు. సర్పంచ్ కాటం వెంకటేశం, వార్డు సభ్యులు ఆనకటి నరేష్, ఏర్పుల వెంకన్న, కురు యాదయ్య, నీలకంఠం లింగస్వామి తదితరులు కప్పలకు నీళ్లు పోసి మొక్కు తీర్చుకున్నారు.
వార్తలు
VIDEO: వర్షాలు కురవాలని కప్ప కాముడు ఆటలు


