హైదరాబాద్: 28°C
వార్తలు

ఖమ్మంపై బీఆర్‌ఎస్ కక్ష: మంత్రి పొంగులేటి

KMM: ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు దొరల పాలనకు వ్యతిరేకంగా ఉన్నారనే కారణంతోనే, గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇక్కడి ప్రాంతాలపై కక్ష కట్టిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి విమర్శించారు. ఎన్నికల్లో తమకు సీట్లు రాలేదన్న కోపంతోనే భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలకు గత పాలకులు అన్యాయం చేశారని, దీనికి 'సీతారామ ప్రాజెక్ట్' నిర్లక్ష్యమే నిదర్శనమని ఆయన ఆరోపించారు.