హైదరాబాద్: 28°C
వార్తలు

బోనాలు.. అమ్మవారికి పట్టు వస్త్రాలు

గోల్కోండ బోనాల వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. కాసేపట్లో మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ తదితర మంత్రులు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. తెలంగాణలోనే మొదటి బోనం గోల్కొండ జగదాంబిక అమ్మవారికే సమర్పించడం ఇక్కడి సాంప్రదాయం. లంగర్ హౌస్ నుంచి గోల్కొండ కోట వరకు సాగే ఊరేగింపు, పోతురాజుల నృత్యాలు, ఘటాల ఊరేగింపు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటాయి.