హైదరాబాద్: 28°C
వార్తలు

కాలేజీ ఉందని ప్రవేశాలు.. ఇప్పుడు లేదంటున్నారే!

GDWL: రాజోలి మండల కేంద్రంలోని కేజీబీవీలో జూనియర్ కాలేజీ మంజూరైందని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సుమారు 60 మంది విద్యార్థినులకు ప్రవేశాలు కల్పించారు. అయితే ఇప్పటికీ కాలేజీకి అధికారిక కోడ్ రాకపోవడంతో విద్యార్థినులను ఇతర కేజీబీవీలకు మార్చనున్నట్లు స్పెషల్ ఆఫీసర్ చంద్రకళ తెలిపినట్లు సమాచారం. దీంతో ప్రవేశాలు పొందిన విద్యార్థినులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.