మార్కాపురం నుంచి పెద్దారవీడు జూనియర్ కాలేజ్‌కు ప్రతిరోజు 50 మంది విద్యార్థులు వెళుతుంటారు. గతంలో RTC వారు 8:30కు మార్కాపురం నుంచి దోర్నాలకు బస్సు నడుపుతుండేవారు. కాగా, ఇటీవల కాలంలో గంట ఆలస్యంగా 9:30కు బస్సును టైం మార్చడంతో విద్యార్థులు క్లాసులకు హాజరు కాలేకపోతున్నారని తల్లిదండ్రులు వాపోతున్నారు. తిరిగి పాత టైంలోనే బస్సును పునరుద్దించాలని వారు కోరుతున్నారు.
వార్తలు
'బస్సుకు పాత టైమింగ్ కొనసాగించాలి'


