హైదరాబాద్: 28°C
వార్తలు

19 న మీడియా ఫెడరేషన్ జిల్లా మహాసభ

NLR: ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ జిల్లా మహాసభ ఈనెల 19న నెల్లూరు నగరంలోని రోటరీ క్లబ్ భవనంలో నిర్వహిస్తున్నట్లు ఆహ్వాన సంఘం కన్వీనర్ మల్లికార్జున తెలిపారు. ఈ సమావేశానికి మంత్రులు, ప్రజా ప్రతినిధులు, ఏపీ మీడియా ఫెడరేషన్ వ్యవస్థాపకుడు, పలువురు హాజరు కానున్నారు. జిల్లాలోని పాత్రికేయులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.