హైదరాబాద్: 28°C
వార్తలు

అతిపెద్ద అణు కేంద్రం డేటా లీక్

తమిళనాడులోని కుడంకుళం అణు కేంద్రం డేటా లీక్ కలకలం సృష్టించింది. డార్క్ వెబ్‌లో కుడంకుళం 19 వేల కీలక పత్రాలు, కంట్రోల్ రూమ్ మ్యాప్‌లు కూడా లీక్ అయినట్లు తెలుస్తోంది. దీనిపై స్పందించిన NPCIL అణు భద్రతకు ఎలాంటి ముప్పు లేదని స్పష్టం చేసింది. థర్డ్ పార్టీ సర్వర్ హ్యాకింగ్ అయినట్లు వెల్లడించింది. రియాక్టర్ డేటా, సెక్యూరిటీ వ్యవస్థలు సురక్షితంగా ఉన్నట్లు తెలిపింది.