హైదరాబాద్: 28°C
వార్తలు

'శక్తి యాప్‌' వినియోగంపై అవగాహన

SKLM: ఆమదాలవలస సర్కిల్ శక్తి టీమ్ -2 ఇంచార్జ్ టి. అమ్మజీ ఆధ్వర్యంలో గురువారం సరుబుజ్జిలి ఎం.పురుషోత్తపురంలో శక్తి యాప్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. శక్తి యాప్ డౌన్‌ లోడ్ విధానం, సైబర్ నేరాల నివారణ, పోక్సో చట్టం, చైన్ స్నాచింగ్‌‌ల నివారణ, వంటి అంశాలపై వివరించారు. చదువుకోక పోయినా శక్తి యాప్‌ను ఎలా వినియోగించుకోవాలో ప్రజలకు వివరించారు.