హైదరాబాద్: 28°C
వార్తలు

రికార్డు స్థాయిలో పసుపు ధర

TG: మహబూబాబాద్ జిల్లా కేసముద్రం వ్యవసాయ మార్కెట్‌లో నిన్న పసుపు ధర రికార్డు స్థాయిలో పలికింది. క్వింటాకు రూ.16,159గా నమోదైంది. ఈ మార్కెట్‌లో 2009, 2021లో పసుపు ధర రూ.16 వేల మార్కు దాటగా, తాజాగా మళ్లీ ఆ స్థాయితో ధర రావడం విశేషం. కనిష్ఠంగా రూ.10,300, సగటున రూ.14,312 పలికింది. మూడు వారాలుగా పసుపు ధర ఈ మార్కెట్‌లో పెరుగుతూ వస్తోంది.