హైదరాబాద్: 28°C
వార్తలు

నెట్ వర్క్ పనిచేయక ఇబ్బందులు..

ADB: సాత్నాల మండలంలోని జామిని, జున్నాపని గ్రామాల్లో మొబైల్ నెట్వర్క్ పనిచేయకపోవటంతో ఇబ్బందులకు గురవుతున్నామని గ్రామస్తులు తెలిపారు. దీంతో వృద్ధాప్య, వికలాంగుల పెన్షన్లు పంపిణీ, అత్యవసర సమయాల్లో ఇబ్బందులకు గురవుతున్నామని వాపోయారు. సమస్యను పరిష్కరించాలని కోరుతూ సంబంధిత నెట్వర్క్ మేనేజర్‌ని కలవగా ఆయన సానుకూలంగా స్పందించినట్లు గ్రామస్తులు పేర్కొన్నారు.