హైదరాబాద్: 28°C
వార్తలు

వైభవంగా శ్రీ వారాహి మాత నవరాత్రి పూజలు

VZM: విజయనగరం పెద్ద చెరువు ఉత్తర గట్టున కొలువై ఉన్న శ్రీ విజయసాగర దుర్గా మల్లేశ్వరి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో నిర్వహిస్తున్న శ్రీ వారాహి మాత నవరాత్రి మహోత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గురువారం రెండో రోజు ఉదయం ప్రత్యేక పూజలు, హోమాలు, అర్చనలు వైభవంగా నిర్వహించారు. అనంతరం శ్రీ వారాహి మాతను ప్రత్యేకంగా అలంకరించారు.