హైదరాబాద్: 28°C
వార్తలు

FIR ఆలస్యమైతే ప్రమాదమే: సుప్రీంకోర్టు

FIR నమోదు, న్యాయాధికారికి పంపడంలో అకారణ ఆలస్యం కేసును దెబ్బతీస్తుందని సుప్రీంకోర్టు పేర్కొంది. జాప్యం వల్ల రికార్డులు, సమయాలు తారుమారయ్యే ప్రమాదం ఉందంది. ఈ లోపాల నేపథ్యంలో 1977 నాటి యూపీ హత్య కేసులో ఐదుగురిని నిర్దోషులుగా విడిచిపెట్టింది. దర్యాప్తు వైరుధ్యాలు, FIR ప్రామాణికతపై సందేహాల వల్ల కింది కోర్టుల శిక్షా తీర్పులను కొట్టివేసింది.