హైదరాబాద్: 28°C
వార్తలు

జగన్నాథుడి ఆశీస్సులతోనే రాష్ట్రపతి పదవి: ముర్ము

రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికైనప్పుడు పూరీ జగన్నాథుడిని వేడుకున్నట్లు ద్రౌపది ముర్ము తెలిపారు. 2022 రథయాత్ర సమయంలో ఢిల్లీలో ఉండటంతో, హాజ్‌ఖాస్ జగన్నాథ స్వామిని దర్శించుకుని నామినేషన్ వేశానని చెప్పారు. 2022 జులై 25న మహాప్రభుని స్మరిస్తూ పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేశానన్నారు. స్వామి ఆశీస్సులతోనే ఈ ప్రయాణం విజయవంతమైందని పేర్కొన్నారు.