హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రతి మహిళ శక్తి యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి: సీఐ

VZM: కొత్తవలస పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న దేశపాత్రునిపాలెం గ్రామంలో సీఐ టీ.వీ. విజయ్ కుమార్, పోలీసు చట్టాలపై గ్రామస్తులకు బుధవారం రాత్రి అవగాహన కల్పించారు.సైబర్ నేరగాళ్ళ ఉచ్చులో పడొద్దని, ప్రతి మహిళ శక్తి యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని, దాంతో స్వీయ రక్షణ పొందాలని సూచించారు. గ్రామాల్లో ఎటువంటి వివాదాల జోలికి పోకుండా స్నేహపూర్వకంగా మెలగాలని కోరారు.