హైదరాబాద్: 28°C
వార్తలు

'మాదకద్రవ్య రహిత సమాజానికి సమష్టి కృషి అవసరం'

NLG: మాదకద్రవ్య రహిత సమాజ స్థాపనకు ప్రభుత్వం, విద్యాసంస్థలు, సమాజం సమన్వయంతో ముందుకు సాగాలని జిల్లా అదనపు ఎస్పీ జి.రమేష్ పిలుపునిచ్చారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ‘సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్’ (సీబీసీ) ఆధ్వర్యంలో నిర్వహించిన ‘నషా ముక్త్ భారత్ అభియాన్’ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు.