ముంబై పరిసర ప్రాంతాల్లో మడ అడవులు వేగంగా తగ్గిపోవడంపై బాంబే హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఆర్థిక నగరంలో ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో ప్రజలు ఆక్సిజన్ తీసుకోవడానికి సిలిండర్లు వెంట తీసుకెళ్లాల్సిన పరిస్థితి వస్తుందని వ్యాఖ్యానించింది. చెట్లు నరికివేయడం కంటే వాటికి బదులుగా నాటిన మొక్కలు నిజంగా పెరుగుతున్నాయా లేదా అన్నదే ప్రధాన సమస్య అని పేర్కొంది.
వార్తలు
ఆక్సిజన్ సిలిండర్లు మోసుకెళ్లే రోజులొస్తాయి: హైకోర్టు


