హైదరాబాద్: 28°C
వార్తలు

శ్రీ మఠం హుండీ ఆదాయం ఎంతంటే.?

KRNL: మంత్రాలయం శ్రీ మఠంలో బుధవారం 22 రోజుల హుండీని లెక్కించారు. మేనేజర్ ఎస్కే శ్రీనివాసరావు పర్యవేక్షణలో నిర్వహించిన లెక్కింపులో నగదు రూ.3,60,37,959, నాణేలు రూ.10,97,300 లభించాయి. మొత్తం హుండీ ఆదాయం రూ.3,71,35,259గా నమోదైంది. భక్తులు 23 గ్రాముల బంగారం, 1,085 గ్రాముల వెండిని కానుకగా సమర్పించారు. కాగా ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని మేనేజర్ తెలిపారు.