హైదరాబాద్: 28°C
వార్తలు

రొయ్యల రైతుల సంక్షేమానికి ప్రాధాన్యత: అచ్చెన్న

AP: రొయ్యల రైతుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందని మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. ఆక్వా రైతుల సమస్యలకు శాశ్వత పరిష్కారాల అమలుకు కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. ఈ మేరకు శాస్ట్రీయ విధానాలు రూపొందించాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. రొయ్యల ఫీడ్ ధరల నిర్ణయంలో పారదర్శక చర్యలు ఉండాలని సూచించారు. రొయ్యల సాగు వ్యయం తగ్గించేందుకు కేంద్రంతో సమన్వయం చేసుకోవాలన్నారు.